: తెలంగాణవాదం లేదనడం సరికాదు: పాల్వాయ్
సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నంత మాత్రాన తెలంగాణ వాదం ఈ ప్రాంతంలో లేదనడం సరికాదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఏ ఒక్కిరిదో కాదని, కార్యకర్తలతో పాటు అందరి సమష్టి విజయమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తెలంగాణ ఇవ్వకపోతే ప్రజలు తమకు ఓటేస్తారన్న నమ్మకం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.