: అందుకే వర్షాలు లేవు, దుర్ఘటనలు జరుగుతున్నాయి... టీడీపీ నేతలు క్షమాపణలు చెప్పాలి: ఉత్తరాంధ్ర సాధూ పరిషత్


శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామికి టీడీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని ఉత్తరాంధ్ర సాధూ పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు విశాఖలో వారు ఆందోళన నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రాత్రి ప్రమాణస్వీకారం చేయకూడదని స్వరూపానంద స్వామి సూచించారని, దానిని ఆయన నిర్లక్ష్యం చేశారని వారు తెలిపారు. అందువల్లే వర్షాలు కురవడం లేదని, ప్రమాదాలు సంభవిస్తున్నాయని వారు ఆరోపించారు. ప్రమాణ స్వీకారం రోజునే ఐదుగురు మరణించారని వారు గుర్తు చేస్తున్నారు.

గతంలో రాత్రిళ్లు ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రులు దుష్ఫలితాలు పొందారని స్వామీజీ తెలిపారు. దీనిపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ముహూర్తం చూసుకునే ప్రమాణస్వీకారం చేపట్టామని స్పష్టం చేశారు. దీంతో ఉత్తరాంధ్ర సాధూ పరిషత్ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. సాధువులను కించపరిస్తే ఒప్పుకోమని హెచ్చరించింది. చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడమని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News