: సరయు నదిలో విద్యార్థుల గల్లంతుపై కేసీఆర్ సమీక్ష
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య వద్ద సరయు నదిలో ఇద్దరు తెలుగు విద్యార్థులు గల్లంతైన విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల రక్షణార్థం సహాయక బృందాన్ని అయోధ్యకు పంపాలని అధికారులను ఆదేశించారు. ఒక యాగ కార్యక్రమంలో పాల్గొనేందుకు 50 మంది వేద విద్యార్థులు అయోధ్యకు వెళ్లారు. నదీ స్నానం చేస్తూ వీరిలో ఇద్దరు గల్లంతయ్యారు.