: బ్యాగ్ లో కోటి.. పోలీసులకు అప్పగించిన యువకుడు
ఒక యువకుడికి ఖమ్మం రైల్వే స్టేషన్ లో ఒక బ్యాగ్ లభ్యమైంది. తెరచి చూస్తే బంగారం. నోట్ల కట్టలు, విలువైన పత్రాలు కనిపించాయి. వీటి విలువ కోటి రూపాయల వరకూ ఉంటుందని సమాచారం. అయినా ఆ యువకుడి మనసు నిజాయతీనే చాటింది. ఆ బ్యాగ్ ను తీసుకెళ్లి రైల్వే పోలీసులకు అప్పగించాడు. ఈ బ్యాగ్ ను కోర్టుకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. దొరికిన బ్యాగ్ గుంటూరు వ్యాపారిదిగా అనుమానిస్తున్నారు.