: పశ్చిమగోదావరి జిల్లాలో లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ లో మంటలు


లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగాయి. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు-తాడేపల్లిగూడెం మధ్యలో లగేజీ బోగీలోంచి మంటలు గుర్తించిన ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్ ను ఆపేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇంతలో రైల్వే సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నారు. లగేజీలో ఏవైనా ఫ్లేమబుల్స్ పెట్టారా? లేక ఇంకేదైనా కారణంగా మంటలు చెలరేగాయా? అనే దానిని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News