: డీఎస్సీని ప్రతి యేటా నిర్వహిస్తాం: మంత్రి గంటా
ఇకపై ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. డీఎస్సీకి టెట్ రద్దు చేసే యోచనలో ఉన్నామని ఆయన చెప్పారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై రెండు రాష్ట్రాలు చర్చించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్లే విద్యార్థులు నష్టపోతున్నారని గంటా అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు.