: గండిపేటలో మృతిచెందిన యువతి ఆచూకీ లభ్యం
నిన్న గండిపేట వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతి ఆచూకీ తెలిసింది. మరణించిన యువతి హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన సానియాగా గుర్తించారు. ఓ ఫంక్షన్ కి వెళ్తానంటూ గురువారం ఇంటి నుంచి కారులో బయలుదేరి వెళ్లిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మరణవార్తతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. సానియా నగరంలోని ఓ సంస్థలో ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తోందని చెప్పారు.