: ఇక ఇంటివద్దకే ఉద్యోగాలు!
కాళ్ళరిగేలా, ముఖం మాడిపోయేలా నిరుద్యోగులు ఆఫీసుల వెంట తిరగాల్సిన బాధ తప్పనుంది. జీహెచ్ఎంసీ తాజాగా ఇంటివద్దకే ఉద్యోగాలు పథకంలో భాగంగా హైదరాబాదులో 'ఈ-వ్యాన్' అనే సర్వీసును ఆరంభిస్తోంది. ఈ వ్యాన్ బస్తీలు, కాలనీల్లో తిరుగుతూ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. వాటిని కేటగిరీ ఆధారంగా వివిధ కంపెనీలకు చేరవేస్తుంది. విద్యార్హతలను బట్టి ఎక్కడెక్కడ ఏఏ ఉద్యోగాలు ఉన్నాయో వివరిస్తుంది.
ఇందుకోసం హెచ్ఆర్ సేవలందించే టీఎంఐ సంస్థతో జీహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఐదు జోన్లలో ఐదు కార్యాలయాలను నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించనుంది. మరో పదిహేను రోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.