: కోడి గుడ్డు ఎంత పని చేసింది...!


కోడి గుడ్డు రేపిన వివాదం పోలీసుల్ని దాటుకుని మానవ హక్కుల సంఘం ముందుకు వచ్చింది. వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లికి చెందిన రమణ అనే వ్యక్తికి చెందిన కోడి వారి ఇంటికి ఎదురుగా ఉండే టీడీపీ నేత ఇంట్లోకి వెళ్లి గుడ్లు పెడుతోంది. ఆ గుడ్లను వారు ఆనందంగా కూర వండుకుని తినేవారు. కోడి ఎంతకీ గుడ్లు పెట్టడం లేదనే అనుమానం వచ్చిన రమణ భార్య రమణమ్మ తమ కోడి పెట్టిన గుడ్లను ఎవరో దొంగిలిస్తున్నారంటూ దూషించింది. తమనే తిడుతోందని భావించిన టీడీపీ నేత ఆమెపై దాడికి దిగి గాయపరిచాడు.

దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వారి ఇంటివద్దే విచారణ చేశారు. పోలీసుల సమక్షంలో టీడీపీ నేత మరోసారి రమణమ్మపై దాడి చేశాడు. దీంతో పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. దెబ్బలు తిన్నవారిపై హత్యాయత్నం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన పోలీసులు, దాడి చేసిన టీడీపీ నేతపై బెయిలబుల్ కేసు నమోదు చేశారు. దీంతో లబోదిబోమంటూ బాధితుడు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాడు.

  • Loading...

More Telugu News