: ప్రధాని మోడీతో ఫ్రెంచి విదేశాంగ శాఖ మంత్రి భేటీ


ప్రధాని నరేంద్ర మోడీతో ఫ్రెంచి విదేశాంగ శాఖ మంత్రి లారెంట్ ఫాబియస్ సమావేశమయ్యారు. కీలకమైన రక్షణ, వాణిజ్యం తదితర అంశాల్లో పరస్పర సహకారంపై ఈ భేటీలో వారు చర్చించారు.

భేటీ అనంతరం ప్రధాని మాట్లాడుతూ... పారిశ్రామిక అభివృద్ధికి ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు భారత్ ఆసక్తి చూపుతోందన్నారు. తక్కువ ఖర్చుతో రక్షణ సామగ్రి, పర్యాటక రంగం, పట్టణ ప్రణాళికపై చర్చలు జరిపామని లారెంట్ ఫాబియస్ తెలిపారు.

  • Loading...

More Telugu News