: తప్పయిపోయింది... రియల్లీ సారీ: బెంగాల్ ఎంపీ తపస్ పాల్
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పశ్చిమ బెంగాల్ ఎంపీ తపస్ పాల్ స్పందించారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన వారిపై దాడులు, అత్యాచారాలు చేయిస్తానంటూ తాను చేసిన వ్యాఖ్యలపై పాల్ సారీ చెప్పారు. పార్టీని, మీడియాని క్షమాపణ కోరుతున్నానని ఆయన అన్నారు. ఈ మేరకు పార్టీకి లిఖిత పూర్వక వివరణ కూడా రాసి ఇచ్చారు. ఇదిలా ఉండగా, తపస్ పాల్ చేసిన వ్యాఖ్యలపై 24 గంటల్లోగా చర్యలు తీసుకుంటామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.