: ప్రభుత్వరంగ అనుబంధ సంస్థల్లోనూ 60 ఏళ్లకు పెంచాలి: అశోక్ బాబు
పదవీ విరమణ కాలపరిమితిపై ఏపీఎన్జీవోలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శిని కలిశారు. అనంతరం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వరంగ అనుబంధ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ కాలపరిమితిపై మాట్లాడామన్నారు. ప్రభుత్వరంగ అనుబంధ సంస్థల్లో ఉద్యోగుల పదవీ విరమణ కాలపరిమితిని కూడా 60 ఏళ్లకు పెంచాలని కోరినట్టు చెప్పారు. అంతేగాక ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల పదవీ విరమణ కాలపరిమితిపై కార్యదర్శికి వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు. తమ డిమాండ్లపై సీఎంఓ కార్యాలయం సానుకూలంగా స్పందించిందని మీడియాకు వెల్లడించారు.