: ముంబయిలో మహిళలకు రక్షణ కరవు... బాంబే హైకోర్టు ఆందోళన
దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబయిలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని, వారిపై వేధింపులు రోజు రోజుకి మితిమీరుతున్నాయని బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనంతటికి ప్రధాన కారణం ఇంటర్ నెట్ లో విచ్చలవిడిగా దర్శనమిస్తున్న అశ్లీల ఛాయాచిత్రాలు, వీడియోలేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అంతర్జాలంలో అలాంటి వాటిని తొలగించేందుకు 'మహా' ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది. మహిళలపై జరుగుతున్న పలు నేరాలపై డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు విఎం కనడే, పీడీ కోడే విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పైవిధంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించేందుకు సరైన చర్యలు తీసుకోవాలని, పటిష్టమైన రక్షణ విధానాన్ని పాటించాలని ఆదేశించింది.