: హలీం తినాలని ఉందా... అయితే శిల్పారామానికి పదండి!
ఇదేమిటి, హలీం తినాలంటే చార్మినార్ లోని పిస్తా హౌస్ కి కదా వెళ్లాలి అంటారా... మీరు చదివింది కరెక్టే. ఇప్పుడు హలీం రుచుల కోసం హైటెక్ సిటీ సమీపంలోని శిల్పారామానికి కూడా వెళ్లొచ్చు. ఈ ఏడాది శిల్పారామంలో హలీం, బోనాల ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ వెల్లడించారు. జులై 11, 18 తేదీల్లో హలీం ఫెస్టివల్, 20, 27 తేదీల్లో బోనాల ఫుడ్ ఫెస్టివల్ జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కమిషనర్ చెప్పారు.