: ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్ 'సరోద్' దొరికింది
ప్రముఖ సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్ సరోద్ వాయిద్యం దొరికింది. ఈ మేరకు తన సరోద్ దొరికిందంటూ ఆయనే ట్విట్టర్లో వెల్లడించారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ వారు క్షేమంగా దాన్ని తెచ్చిచ్చారని, చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సరోద్ తిరిగి దొరకడంతో తన ఆత్మ తిరిగి వచ్చినట్లనిపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 28న బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానంలో భార్యతో కలసి లండన్ నుంచి ఢిల్లీ తిరిగి వస్తుండగా తన సరోద్ మాయమైందని, దానికి బదులుగా మరొకటి ఇచ్చారని ఉస్తాద్ నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే.