: బీజేపీపైనా గూఢచర్యానికి పాల్పడ్డారు: బాంబు పేల్చిన స్నోడెన్


అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) బీజేపీ పైనా గూఢచర్యానికి పాల్పడిందని ప్రజావేగు (విజిల్ బ్లోయర్) ఎడ్వర్డ్ స్నోడెన్ మరో బాంబు పేల్చారు. ఆరు అమెరికాయేతర రాజకీయపార్టీలపై నిఘా వేసేందుకు ఎన్ఎస్ఏకు అనుమతి మంజూరైందని స్నోడెన్ ను ఉటంకిస్తూ 'ది వాషింగ్టన్ పోస్ట్' పేర్కొంది. ఈ ఆరు పార్టీలపైనే కాకుండా, అమెరికా ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్విలెన్స్ యాక్ట్ (ఎఫ్ఐఎస్ఏ) న్యాయస్థానం 193 దేశాల ప్రభుత్వాలపైనా కన్నేసేందుకు ఎన్ఎస్ఏకు ఈ ప్రత్యేక అనుమతి ఇచ్చిందని స్నోడెన్ పేర్కొన్నారు. వీటిలో భారత్ కూడా ఉందని తెలిపారు.

అయితే, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలపై నిఘా వేసేందుకు మాత్రం అనుమతి లభించలేదట. కాగా, బీజేపీ కాకుండా ఎన్ఎస్ఎ అమాల్ (లెబనాన్), బోలివియేరియన్ కాంటినెంటల్ కోఆర్డినేటర్, ముస్లిం బ్రదర్ హుడ్ (ఈజిప్టు), నేషనల్ సాల్వేషన్ ఫ్రంట్ (ఈజిప్టు), పీపుల్స్ పార్టీ (పాకిస్థాన్)పై గూఢచర్యానికి పాల్పడింది.

  • Loading...

More Telugu News