: అంటార్కిటికాలోని పర్వతానికి ఇండో-అమెరికన్ శాస్త్రవేత్త పేరు


ఇండో-అమెరికన్ శాస్త్రవేత్త అఖౌరి సిన్హాకు అపురూప గౌరవం లభించింది. అంటార్కిటికాలోని ఓ పర్వతానికి సిన్హా పేరు పెట్టాలని అమెరికా నిర్ణయించింది. వన్యప్రాణి సంఖ్యకు సంబంధించి సంక్లిష్ట సమాచారాన్ని అందించడంలో ఈ జెనెటిక్స్ ప్రొఫెసర్ సేవలు నిరుపమానమని యూఎస్ జియోలాజికల్ సర్వే కొనియాడింది. 1971-72 లో జియోలాజికల్ సర్వే ఎక్స్ ప్లోరర్ గా ఆయన సేవలకు గుర్తింపుగా సదరు పర్వతాన్ని 'అఖౌరి సిన్హా మౌంటెన్' అని పిలవాలని నిర్ణయించింది.

  • Loading...

More Telugu News