: ఆంగ్ల దినపత్రికపై సమంత ఆగ్రహం


తాను బాలీవుడ్ తారలు దీపికా పదుకోన్, సోనమ్ కపూర్ లను అనుకరిస్తానని 'టీవోఐ' పేర్కొనడం పట్ల దక్షిణాది నటి సమంత అభ్యంతరం వ్యక్తం చేసింది. టీవోఐ లాంటి జాతీయ పత్రిక ఇలాంటి కథనాలు ప్రచురించడం సరికాదని ట్విట్టర్లో పేర్కొంది. డిజైనర్లు సీజన్ కు నప్పేలా ఒకే కలర్లో కొన్ని దుస్తులను డిజైన్ చేస్తారని, అవి అన్ని దుకాణాల్లోనూ, ఆన్ లైన్ లోనూ లభిస్తాయని సమంత వివరించారు. అవి కేవలం ఏ ఒక్కరి కోసమే తయారుచేయరని, అందరూ వాటిని ధరించవచ్చని వివరించారు. తానూ అలాంటి డిజైనర్ దుస్తులనే ధరించానని, అలాంటప్పుడు తాను ఎవరినో కాపీ కొట్టినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

ఇప్పటివరకు అనేక ఫ్యాషన్ సమీక్షలు తనను పాజిటివ్ గానే చూశాయని చెప్పారు. 'టైమ్స్...' లాంటి పత్రిక తన మొదటిపేజీ కోసం మెరుగైన ప్రమాణాలు పాటిస్తే బావుంటుందని హితవు పలికారు.

  • Loading...

More Telugu News