: యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి చేరుకున్నాం: ఎమ్మెల్సీ స్వామిగౌడ్


తెలంగాణ శాసనమండలి చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ స్వామిగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాచించే స్థాయి నుంచి నేడు శాసించే స్థాయికి చేరుకున్నామని అన్నారు. ఇదంతా ప్రజాస్వామ్యం గొప్పదనమని ఆయన పేర్కొన్నారు. మండలిలో ప్రజల మనిషిగా వ్యవహరిస్తారని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. కేసీఆర్ ఆదేశంతోనే నామినేషన్ వేశానని, ఏకగ్రీవ ఎన్నిక కోసం అన్ని పార్టీల మద్దతు కోరుతున్నానని స్వామిగౌడ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News