: 'ఆర్కుట్' దుకాణం బంద్


పదేళ్ళ క్రితం ప్రారంభమైన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ 'ఆర్కుట్' ఇక మూతపడనుంది. భారత్, బ్రెజిల్ మినహా మిగతా దేశాల్లో నెటిజన్ల ఆదరణకు నోచుకోకపోవడంతో సెప్టెంబర్ 30 నుంచి ఆర్కుట్ ను నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించింది. యూట్యూబ్, బ్లాగర్, గూగుల్ ప్లస్ పురోగతి సాధించాయని, వాటితో పోల్చితే ఆర్కుట్ వెనకబడిపోయిందని భావిస్తున్నట్టు గూగుల్ వర్గాలు తెలిపాయి.

ఆర్కుట్ 2004లో ఊపిరిపోసుకోగా, అదే ఏడాది రంగప్రవేశం చేసిన ఫేస్ బుక్ ఇంతింతై... అన్నట్టు ప్రపంచవ్యాప్తమైంది. వంద కోట్ల 28 లక్షల మంది యూజర్లతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఫేస్ బుక్ ఇప్పుడు రారాజుగా కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News