: తిరుపతిలో స్మగ్లర్ల బహిరంగ విచారణ
తిరుపతిలో నేడు ఎర్రచందనం స్మగర్ల బహిరంగ విచారణ నిర్వహిస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల ఫారెస్టు అధికారుల అదుపులో ఉన్న స్మగర్లందరినీ ఈ సందర్భంగా తిరుపతికి తరలించారు. మొత్తం 346 మందిని మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఇద్దరు అటవీ అధికారుల హత్య కేసులో భాగంగా వీరిపై ఈ బహిరంగ విచారణ చేపట్టారు. ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక ఎర్రచందనం స్మగర్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.