: ఆంధ్రప్రదేశ్ లో ఐటీ, ఫార్మా, ఉత్పత్తి రంగాలను విస్తరిస్తాం: ఏపీ మంత్రి
పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఐటీ పరిశ్రమల స్థాపన కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఐటీ పరిశ్రమల అనుమతుల కోసం ఏక గవాక్ష విధానం అనుసరిస్తామని ఆయన స్పష్టం చేశారు. వంద రోజుల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదిస్తున్నామని తెలిపిన ఆయన, విశాఖపట్టణంలో ఐటీఐఆర్ ఏర్పాటు చేస్తామని అన్నారు.