: ప్రయాణికుల్ని భయపెట్టిన విమానం


అమెరికా విమానం ప్రయాణికుల్ని భయపెట్టింది. లాస్ ఏంజెలిస్ నుంచి షికాగోకు ప్రయాణిస్తున్న విమానం కేవలం 12 నిమిషాల్లో 38 వేల అడుగుల ఎత్తులో గాల్లో ప్రయాణిస్తూ ఒక్కసారిగా 11 వేల అడుగులకు పడిపోయింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు గుండెల్ని చిక్కబట్టుకున్నారు. ఇంతలో ఎమర్జెన్జీ డోర్ ఓపెన్ అయింది. అంతే ఇవే ఆఖరు క్షణాలని భావించి ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు.

పైలట్ చాకచక్యంగా విమానాన్ని అదుపు చేసి కాన్సస్ లోని విచితా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు బ్రతుకుజీవుడా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులు 96 మంది, ఐదుగురు సిబ్బంది విమానంలో ఉన్నారు. వారందర్నీ ఓ గంట తరువాత వేరే విమానంలో గమ్యం చేర్చారు. కాగా ఘటనలో ఎవరూ గాయపడలేదు. విమానం జారిపోవడానికి గల కారణాలను నిపుణులు అన్వేషిస్తున్నారు.

  • Loading...

More Telugu News