: అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని రీకాల్ చేయండి: షబ్బీర్ అలీ
తెలంగాణ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిని వెంటనే రీకాల్ చేయాలని టి.కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. 2007లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని... ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా రామకృష్ణారెడ్డి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వాదించి గెలిచారని అన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు ఆయన వినతి పత్రం అందజేశారు. అలాంటి వ్యక్తిని అడ్వొకేట్ జనరల్ గా నియమించడం మంచిది కాదని సూచించారు.