: విశాఖ గురుద్వార జంక్షన్లో తగలబడిపోయిన రెండు కార్లు
విశాఖపట్టణంలోని గురుద్వార జంక్షన్లో రెండు కార్లు తగలబడిపోయాయి. కార్లలో ఇంధనంగా వినియోగిస్తున్న గ్యాస్ లీకవ్వడంతో కార్లలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు కారు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించినా మంటలు ఆరకపోవడంతో కార్లు తగలబడిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని, మంటలను అదుపుచేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.