: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో కాసేపట్లో సమావేశం కానున్నారు. ఎల్లుండి జరగనున్న శాసనమండలి చైర్మన్ ఎన్నిక అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తాజాగా పార్టీలో చేరిన ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారని సమాచారం.