: ఎయిమ్స్ ఆసుపత్రి బెజవాడకే: కామినేని
ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ను విజయవాడలోనే ఏర్పాటు చేయనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఎయిమ్స్ ఏర్పాటు కోసం రెండు మూడు రోజుల్లో కేంద్ర బృందం పర్యటించనుందని అన్నారు. ఎయిమ్స్ కోసం కేంద్రం 12 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు కామినేని వెల్లడించారు. విజయవాడను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దనున్నట్టు ఆయన తెలిపారు.