: సుస్మితాసేన్ తో వసీం అక్రమ్ వివాహం త్వరలో ..!?


మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ త్వరలో ఒక్కటవనున్నారని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. వీరిద్దరూ రెండేళ్ళ నుంచి ప్రేమాయణం సాగిస్తున్నట్టు ఇంతకుముందే కథనాలు వెలువడ్డాయి. 2008లో ఓ టీవీ చానల్ లో ప్రసారం అయిన 'ఏక్ ఖిలాడి ఏక్ హసీనా' రియాలిటీ షో సందర్భంగా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. ఈ షోలో అక్రమ్, సుస్మిత నిర్ణేతలుగా వ్యవహరించారు.

కాగా, అక్రమ్ భార్య హుమా కొంతకాలం కిందట అనారోగ్యంతో కన్నుమూసింది. ఇక సుస్మిత ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్నా ఇంకా అవివాహితగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినీ-క్రికెట్ జోడీ వివాహం చేసుకుంటారని ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. అయితే, ఇవన్నీ వట్టి పుకార్లేనని సుస్మిత ప్రతినిధి కొట్టిపారేశారు.

  • Loading...

More Telugu News