: ఇషాంత్ పై ప్రేక్షకుల సెటైర్లు
అలరిస్తున్నంతకాలమే అభిమానులు..! కాసింత వైఫల్యం ఎదురైనా నిర్దాక్షిణ్యంగా మాటలతూటాలు రువ్వుతారు! ముఖ్యంగా క్రికెటర్లకు ఈ విషయం బాగా తెలుసు. తాజాగా, టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మకు ఇంగ్లండ్ టూర్లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. లీసెస్టర్ షైర్ తో ప్రాక్టీసు మ్యాచ్ లో లంబూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. వీటికి తోడు అదేపనిగా నోబాల్స్ విసిరాడు. దీంతో, మ్యాచ్ చూస్తున్న అభిమానుల్లో అసహనం చెలరేగింది.
'కాస్త ఒళ్ళు వంచొచ్చు కదా' అని ప్రేక్షకుల్లోంచి ఒకరు అరవగా, ఈ ఓవర్లో ఎన్ని ఫోర్లు ఇస్తావంటూ మరొకరు చురకలేశారు. ప్రాక్టీస్ మ్యాచే కదా అని ఇషాంత్ లూజ్ బౌలింగ్ వేస్తే ఫర్వాలేదు కానీ, ఇంగ్లండ్ తో టెస్టులో ఇలా వేస్తే అరటిపండ్లు, వాటర్ బాటిల్స్ తో కొడతారేమో ప్రేక్షకులు.