: బీజేపీ కార్యకర్తలపై జలఫిరంగులు గర్జించాయ్, లాఠీలు విరిగాయ్
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్నోలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ్ వాదీ పార్టీపై విమర్శల వాన కురిపిస్తూ నినాదాలు చేశారు. తక్షణం అధికారం నుంచి వైదొలగాలని హెచ్చరించారు. ఆందోళన హింసకు దారితీస్తుందని గ్రహించిన పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీలు ప్రయోగించారు. జలఫిరంగులతో నీటిని చిమ్ముతూ ఆందోళనకారులను చెదరగొట్టారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.