: బ్యాంకులు సహకరించడం లేదు: కేఈ
కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సహకరించడం లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అవసరమైతే గ్రామ సభలు నిర్వహించి రుణాలు ఇస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రిజర్వేషన్లు అమలు కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారని, అది వాస్తవం కాదని, రిజర్వేషన్లు అమలవుతున్నాయని ఆయన వెల్లడించారు. ఎస్ఎల్ బీసీ సమావేశంలో బ్యాంకర్ల ముందు ఉంచాల్సిన అంశాలపై రెవెన్యూ అధికారులతో ఆయన చర్చించారు.