: అరుణ్ జైట్లీతో కవిత భేటీ


కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె కోరికల చిట్టా విప్పారు. నిజామాబాద్ జిల్లాలో డిఫెన్స్ హెవీ వెహికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. మెదక్ జిల్లాలో పినాక ప్రాజెక్టు పూర్తి చేయాలని విన్నవించారు. మెదక్ జిల్లాలోని డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని విస్తరించాలని అడిగారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆమె జైట్లీకి సూచించారు.

  • Loading...

More Telugu News