: ముంబయి యువ లాయర్ హత్య కేసులో దోషిగా సెక్యూరిటీ గార్డు


ముంబయికి చెందిన పల్లవి అనే యువ న్యాయవాది హత్య కేసులో సజ్జద్ అహ్మద్ మొగల్ అనే సెక్యూరిటీ గార్డును దోషిగా స్థానిక కోర్టు ప్రకటించింది. ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడని కూడా తెలిపింది. జులై 9న ఈ కేసులో న్యాయస్థానం తుది తీర్పు వెలువరించనుంది. ఈ సందర్భంగా పల్లవి తండ్రి మాట్లాడుతూ, దోషికి మరణశిక్ష విధించాలని తాము కోరుతున్నామన్నారు. తమ కుమార్తె మరణం ఒక భీకరమైన హత్యని, ఇప్పటివరకు తాము నరకంలో జీవిస్తూ వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. 2012, ఆగస్టు 9న ఇరవై ఐదేళ్ల పల్లవి ముంబయిలోని వాదాల అపార్టుమెంటులో దారుణ హత్యకు గురైంది. ఆమె మరణించిన రెండేళ్ల తర్వాత కేసులో తీర్పు రానుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News