: బియాస్ నదిలో మరో విద్యార్థి మృతదేహం లభ్యం
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల్లో మరొకరి మృతదేహం దొరికింది. నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన విష్ణువర్ధన్ గా గుర్తించారు. దాంతో, ఇప్పటివరకూ నదిలో వెలికితీసిన మృతదేహాల సంఖ్య ఇరవైకి చేరింది. ఇంకా నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. అటు బియాస్ నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.