: ఎంపీటీసీ కిడ్నాప్... వైఎస్సార్సీపీపై ఫిర్యాదు
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చాకిరాల ఎంపీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి కిడ్నాప్ కు గురయ్యారు. ఆమెను వైఎస్సార్సీపీ నేతలు కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె కోసం పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. సాధ్యమైనంత తొందర్లో ఆమెను సురక్షితంగా తీసుకొస్తామని పోలీసులు తెలిపారు.