: గాంధీ భవన్ లో టీకాంగ్ ఎమ్మెల్సీల భేటీ


గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. శాసన మండలి ఛైర్మన్ పదవి కోసం పోటీ చేసే అంశంపై వీరు చర్చిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లోకి మారడంతో శాసన మండలి ఛైర్మన్ పదవి దక్కించుకునేందుకు ఆ రెండు పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి.

శాసన మండలిలో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ తన ఆధిపత్యం నిరూపించుకోవాలంటే పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేయాలి. అందుకే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఐదుమందిని బహిష్కరించాలని కోరుతూ స్పీకర్ కు కాంగ్రెస్ నేతలు లేఖ ఇచ్చారు. దీంతో శాసన మండలి ఛైర్మన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News