: షార్ శాస్త్రవేత్తలను అభినందించిన జగన్
షార్ శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత జగన్ అభినందించారు. పీఎస్ఎల్వీ సీ-23 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష ప్రయోగాల్లో షార్ మరిన్ని విజయాలు సాధించి, ప్రపంచానికి మార్గదర్శకంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. కీలక ప్రయోగాలు చేపట్టి దేశ ప్రతిష్ట పెంచిన ప్రతి శాస్త్రవేత్త అభినందనీయులని ఆయన పేర్కొన్నారు.