: పాకిస్థాన్ అనుకూల వ్యాఖ్యలు చేసిన ఎస్పీ నేత అరెస్ట్


పాకిస్థాన్ కు అనుకూలంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ నేత మెహమూద్ ఆలంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనను షమ్లీ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. మీరట్-కర్నల్ రహదారిపై వెళుతున్న వారి నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ఈ నేత మద్యం సేవించి ఉన్నారని పోలీసులు వివరించారు. అయితే, తనను అరెస్టు చేయడంపై సదరు నేత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడని చెప్పారు. అప్పుడే 'పాక్ జిందాబాద్', 'మోడీ ముర్దాబాద్' అంటూ నినాదాలు చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో ఎస్పీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఉన్నతాధికారులు ఆదేశించారు.

  • Loading...

More Telugu News