: 'డయల్ 100'.. ప్రారంభించిన సీఎం
ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు వీలుగా 'ఇంటివద్దకు పోలీసులు' విధానంలో భాగంగా 'డయల్ 100' పథకాన్ని నేడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా షామీర్ పేట వద్ద గల ఈఎంఆర్ఐ కార్యాలయంలో సీఎం ఈ పథకాన్ని ప్రజలకు అంకితం చేశారు. ప్రజల సౌలభ్యం కోసమే ఈ విధానానికి రూపకల్పన చేసినట్టు రాష్ట్ర డీజీపీ దినేశ్ రెడ్డి వెల్లడించారు. 100 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే పోలీసులు తక్షణమే బాధితుల వద్దకు నేరుగా వస్తారు.