: జ్వరాన్ని తగ్గించే 'జాకెట్'!
సాధారణంగా జ్వరం వస్తే ఏం చేస్తాం? ఏ పేరాసెట్మల్ ట్యాబ్లెటో మింగి విశ్రాంతి తీసుకుంటాం. అయితే, జ్వరానికి మందులు వేసుకునే బదులు తాము రూపొందించిన జాకెట్ ధరించమంటున్నారు భిలాయ్ (చత్తీస్ గఢ్) లోని శ్రీ శంకరాచార్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ పంకజ్ అగర్వాల్. తన శిష్యుల సాయంతో ఆయన ఈ ప్రత్యేక జాకెట్ రూపొందించారు. ఈ తొడుగులోపలి వ్యవస్థ అచ్చు ఎయిర్ కండిషనర్ మాదిరే పనిచేస్తుంది.
దీంట్లో ఓ రాగి తీగ చుట్ట, కండెన్సర్ ఉంటాయి. శరీర ఉష్ణోగ్రతను చల్లబరిచేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. తమ జాకెట్ ద్వారా రోగులకు మందులు వేసుకునే బాధ తప్పుతుందని ప్రొఫెసర్ అన్నారు.