: నటి శారద, మోహన్ బాబులకు శ్రీకృష్ణదేవరాయ పురస్కారాలు
ప్రముఖ సినీ నటి శారద, నటుడు ఎం.మోహన్ బాబులను శ్రీకృష్ణదేవరాయ పురస్కారాలతో సత్కరించారు. వీరితో పాటు కవి, విమర్శకుడు హంపా నాగరాజయ్యను కూడా ఈ పురస్కారంతో సన్మానించారు. తెలుగు విజ్ఞాన సమితి 62వ సంస్థాపన దినోత్సవాలు ఆదివారం బెంగళూరులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆ ముగ్గురికి ఘన సత్కారం జరిగింది. కర్ణాటక న్యాయ, శాసనసభ వ్యవహారాల మంత్రి టి.బి.జయచంద్ర, కన్నడ-సంస్కృతి శాఖల మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.