: మా జట్టు బాగా ఆడింది...కానీ ఓడింది: మెక్సికో అధ్యక్షుడు
బ్రెజిల్ లో జరుగుతున్న పిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీలో తమ జట్టు ఓటమి పాలైనప్పటికీ ఉత్తమ ప్రదర్శన చేసిందని మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్యూ పెనా అభినందించారు. టోర్నీ ఆసాంతం జట్టు సమష్టిగా ఆడిందని, ఆటతీరులో లోపం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, 'రోజు' నెదర్లాండ్స్ ది కావడంతో తమ జట్టు ఓటమిపాలైందని అన్నారు. మెక్సికో ఆధిక్యం ప్రదర్శించడంతో గెలుపు సొంతం అవుతుందని తాము భావించామని... అయితే చివర్లో నెదర్లాండ్స్ జూలు విదిల్చడంతో మెక్సికో ఇంటి ముఖం పట్టిందని తెలిపారు.