: ఇంజినీరింగ్ సీటు సాధించిన హిజ్రా


తమిళనాడులో ఓ హిజ్రా ఇంజినీరింగ్ కాలేజీలో ప్రవేశం పొంది చరిత్ర సృష్టించింది. గ్రేస్ బాను అనే ఈ ట్రాన్స్ జెండర్ అన్నా యూనివర్శిటీ కౌన్సిలింగ్ లో లేటరల్ ఎంట్రీ ద్వారా ట్రిపుల్ ఈ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) కోర్సులో సీటు దక్కించుకుంది. ఆమెకు అరక్కోణంలోని శ్రీకృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో సీటు లభించింది. ఈ విషయమై గ్రేస్ మాట్లాడుతూ, ఇంజినీరింగ్ సీటు సాధించిన తొలి ట్రాన్స్ జెండర్ నని, అయితే, తనకు సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీలో అడ్మిషన్ దొరికిందని వాపోయింది.

గ్రేస్ 94 శాతం మార్కులతో పాలిటెక్నిక్ లో ఉత్తీర్ణురాలు కావడం విశేషం. కాగా, ప్లస్ టూలో ఉన్నప్పుడు గ్రేస్ తల్లిదండ్రులు ఆమెను వదిలేశారు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలకు ఓర్చి ఇంజినీరింగ్ వరకు రావడం నిజంగా అభినందనీయం.

  • Loading...

More Telugu News