: మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం: మోడీ
పీఎస్ఎల్వీ-సీ23 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల కృషిని భారత ప్రధాని మోడీ కొనియాడారు. ఇదో అద్భుత విజయమని అన్నారు. ఈ గొప్ప విజయానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. సొంత నేవిగేషన్ వ్యవస్థకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని అన్నారు. ఇప్పటి వరకు పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 67 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశ పెట్టామని చెప్పారు.
అనుకున్న విధంగానే ఉపగ్రహాలన్నింటినీ కచ్చితత్వంతో కక్ష్యలో ప్రవేశపెట్టామని తెలిపారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి భారతదేశానిది సుదీర్ఘ ప్రయాణమని... భవిష్యత్తులో భారీ విజయాల దిశగా కొనసాగుతామని అన్నారు. పీఎస్ఎల్వీ-సీ23 ప్రయోగంతో ప్రపంచానికి తన సత్తా ఏమిటో భారత్ చాటిందని చెప్పారు.