: నిప్పులు చిమ్ముతూ దూసుకుపోయిన పీఎస్ఎల్వీ-సీ23
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ23 నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. ఈ ఉదయం 9.52 గంటలకు పీఎస్ఎల్వీ వాహక నౌకను ప్రయోగించారు. ఈ ప్రయోగానికి 49 గంటల కౌంట్ డౌన్ ను కొనసాగించారు. ఈ ప్రయోగంతో భారత్ కు చెందిన 60 కిలోల అడ్వాన్స్ డ్ ఇంటర్నల్ నావిగేషన్ సిస్టమ్ పేలోడ్ తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, సింగపూర్ దేశాలకు చెందిన ఐదు శాటిలైట్లను ఇస్రో నింగిలోకి పంపింది. ఈ ప్రయోగాన్ని భారత ప్రధాని మోడీ, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, జితేంద్రసింగ్ ప్రత్యక్షంగా వీక్షించారు.