: ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
రేపట్నుంచి పవిత్ర రంజాన్ మాసం ఆరంభం అవుతున్న నేపథ్యంలో, ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లింల కోసం ప్రవేశపెట్టిన పథకాలను పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.