: ఇరాక్ సంక్షోభంపై గల్ఫ్ లోని భారత రాయబారులతో సుష్మ సమీక్ష


అంతర్గత పోరుతో అట్టుడుకుతున్న ఇరాక్ పై భారత్ దృష్టి సారించింది. ఈ క్రమంలో ఈ రోజు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గల్ఫ్ దేశాల భారత రాయబారులతో సమావేశమయ్యారు. ఇరాక్ లో నెలకొన్న పరిస్థితులు, భారతీయుల రక్షణ తదితర అంశాలను ఆమె సమీక్షిస్తున్నారు. ఇరాక్ లో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను సురక్షితంగా భారత్ కు తరలించే అంశంపై వారు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News