: ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఉన్మాది ఘాతుకం
ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఓ ఉన్మాది చెలరేగిపోయాడు. స్థానికంగా ఉన్న ఓ ఫ్యాన్సీ షాపులో శివ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఈ రోజు యజమాని నవీన్ కూతురు కుసుమరాణి (5) ఇంటివద్ద ఆడుకుంటూ ఉండగా పక్కనున్న వాగు దగ్గరకు తీసుకెళ్లి గొంతు కోసి పరారయ్యాడు. రక్తపుమడుగులో ఉన్న బాలికను చూసిన వారు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే, ఈ దాడి వెనకున్న కారణాలు మాత్రం తెలియరాలేదు.