: ఇద్దరు జనరల్ మేనేజర్ స్థాయి అధికారుల్ని సస్పెండ్ చేసిన గెయిల్
నగరం పేలుడు దుర్ఘటనపై గెయిల్ యాజమాన్యం సంస్థాగత చర్యలు చేపట్టింది. ఇద్దరు జనరల్ మేనేజర్ స్థాయి అధికారుల్ని సస్పెండ్ చేశామని గెయిల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎ.కర్ణాటక్ తెలిపారు. లీకైన గ్యాస్ సాధారణంగా గాలిలో కలిసిపోతుందని ఆయన చెప్పారు. అయితే, ఈ గ్రామంలో లీకైన గ్యాస్ వలయాకారంలో ఎందుకు ఏర్పడింది? పేలుడుకు ఎందుకు కారణమయింది? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.