: చిరంజీవి, బొత్సలకు పరాభవం... మీ పరామర్శలు మాకొద్దన్న నగరం గ్రామస్తులు
తూర్పుగోదావరి జిల్లాలో పేలుడు సంభవించిన నగరం గ్రామాన్ని ఈ రోజు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య సందర్శించారు. ఈ సమయంలో వారికి ఊహించని పరాభవం ఎదురైంది. 'మీ పరామర్శలు మాకు అవసరం లేదంటూ' నగరం గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట కూడా జరిగింది. అనంతరం చిరంజీవి, బొత్స బాధిత కుటుంబాలను పరామర్శించారు.